Header Banner

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక వారికి పండగే పండుగ! విద్యాశాఖ సంచలన నిర్ణయం!

  Sat Feb 22, 2025 19:49        Politics

ఏపీ విద్యార్ధులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్ అందించింది కూటమి సర్కార్. ఇప్పటికే ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల విద్యార్ధులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పధకాన్ని అమలు చేస్తోంది. తాజాగా జోన్ల వారీగా మిడ్ డే మీల్ మెనూలో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. కొత్త మెనూనూ 4 జోన్లవారీగా ఈ రెండు నెలల పాటు అనగా ఏప్రిల్ వేసవి సెలవుల వరకు ప్రయోగాత్మకంగా అమలుకు విద్యాశాఖ సిద్దమైంది. ఆ తర్వాత అభిప్రాయాలు స్వీకరించి.. మెనూలో తుది మార్పులు తీసుకురానుంది. జోన్ 1లోకి ఉత్తరాంధ్ర, జోన్ 2లోకి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు కాగా.. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు జోన్ 3లోకి.. రాయలసీమను జోన్ 4గా విభజించింది.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు! 


ఆయా ప్రాంతాల్లోని స్థానిక వంటలు, అభిరుచులు, పోషకాలను పరిగణనలోకి తీసుకుని ఆహరం అందించాలని విద్యాశాఖ ఆదేశించింది. జోన్ల వారీగా మిడ్ డే మీల్ ఇలా.. జోన్ 1(ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు): అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, గుడ్డు కూర, రసం, రాగిజావ, వెజ్ పలావ్, ఆలూ కూర్మా, చిక్కీ, సాంబారు, పులిహోర, స్వీట్ పొంగలి రోజుకో రకం ఇస్తారు. జోన్ 2(ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు): రెగ్యులర్ ఫుడ్‌తో పాటు అదనంగా ఫ్రైడ్ ఎగ్, మిక్స్ డ్ వెజిటబుల్ కూర జోన్ 3(ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు): రోజూవారీ ఆహారంతో పాటు అదనంగా టమాటా పప్పు, టమాటా/పుదీనా చట్నీ జోన్ 4(చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలు): అదనంగా పులగం, వేరుశనగ చట్నీ, ఉప్పు కారంతో గుడ్డు, కందిపప్పు చారు, బెల్లం పొంగలి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు



పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #students #middaymeals #menuchange #todaynews #flashnews #latestupdate